Highlights
- కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది
- అధికారులతో సంప్రదింపులు జరుపుతా
- అనంతరం తుది నిర్ణయం తీసుకుంటాం
విశాఖకు రైల్వే జోన్ పై సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే జోన్ అంశం పరిశోలనలో ఉందని తాను పలు సందర్భాల్లో సమాధానం ఇచ్చానని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎక్కడా లేదని, పరిశీలించాలని మాత్రమే ఉందని పీయూష్ గోయల్ అన్నారు. విశాఖకు రైల్వే జోన్ పై సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతామని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ ఎంపీలు తనను కలవడానికి ఒప్పుకోలేదని మీడియాలో కథనాలు వచ్చాయని, అవి అవాస్తవాలని చెప్పారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎంపీలు తనను కలిసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. టీడీపీ ఎంపీలు తన అపాయింట్ మెంట్ కోరినట్లు తనకు సమాచారం అందలేదని అన్నారు. టీడీపీ ఎంపీలు తన ఆఫీసుకి వచ్చినట్లు కూడా తన దృష్టికి రాలేదని అన్నారు.