YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

నిరుప‌యోగ వ‌స్తువుల సేక‌ర‌ణ‌కు బ‌ల్దియా స్పెష‌ల్ డ్రైవ్‌

నిరుప‌యోగ వ‌స్తువుల సేక‌ర‌ణ‌కు బ‌ల్దియా స్పెష‌ల్ డ్రైవ్‌

నిరుప‌యోగ వ‌స్తువుల సేక‌ర‌ణ‌కు బ‌ల్దియా స్పెష‌ల్ డ్రైవ్‌
హైదరాబాద్ అక్టోబర్ 22
మీ ఇంట్లో ప‌నికిరాని వ‌స్తువులు ఉన్నాయా...ఉంటే వాటిని రోడ్ల‌పైగాని, చెత్త‌కుప్ప‌ల్లో గాని, నాలాల్లో వేయ‌వ‌ద్దు. వీటిని మీ ఇంటి వ‌ద్ద‌నుండే జిహెచ్ఎంసి సేక‌రించ‌నున్న‌ది. ఈ నిరుప‌యోగ వ‌స్తువుల‌ను సేక‌రించేందుకు జిహెచ్ఎంసి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. న‌వంబ‌ర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వ‌ర‌కు ప‌దిరోజుల పాటు జిహెచ్ఎంసి ప‌రిధిలోని ఇళ్ల‌లో వృథాగా ఉన్న పాత వ‌స్తువులు, కూల‌ర్లు, ప‌రుపులు, మెత్త‌లు, ప‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇత‌ర నిరుప‌యోగ వ‌స్తువుల‌ను ఈ ప్ర‌త్యేక డ్రైవ్‌లో సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. న‌గ‌రంలో ఈ ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటిని ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారు. త‌ద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావ‌డంతో రోడ్ల‌పై మురుగునీరు పొంగ‌డం, నాలాల ద్వారా నీరు స‌క్ర‌మంగా ప్ర‌వ‌హించ‌కుండా ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం కావ‌డం న‌గ‌రంలో సాధార‌ణంగా మారింది. ఇటీవ‌ల న‌గ‌రంలోని ఖాళీ స్థ‌లాలు, పార్కులు, ర‌హ‌దారులవెంట ప్లాస్టిక్ ఏరివేత కార్య‌క్ర‌మాన్ని జిహెచ్ఎంసి విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. ఈ ప్లాస్టిక్ డ్రైవ్ ద్వారా 150 మెట్రిక్‌ ట‌న్నుల ప్లాస్టిక్ ను జిహెచ్ఎంసి సేక‌రించింది. త‌ద్వారా ఇటీవ‌లకాలంలో వ‌రుస‌గా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల నాలాలు, డ్రెయిన్‌లు, మ్యాన్‌హోళ్ల‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు త‌క్కువ‌గా ఉండ‌డంతో వ‌ర‌ద‌నీరు స‌క్ర‌మంగా పారేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఇదేమాదిరిగా ప్లాస్టిక్ ఏరివేత వ‌ల్ల వ‌చ్చిన స‌త్ఫ‌లితాల దృష్ట్యా ఇళ్ల‌లోని వృథా వ‌స్తువుల‌ను కూడా సేక‌రించేందుకు జిహెచ్ఎంసి ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. దాదాపు 10రోజుల పాటు కొన‌సాగే ఈ డ్రైవ్‌లో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేస‌న్లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మ‌హిళా సంఘాల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకుగాను ఆర్‌.డ‌బ్య్లూ.ఏలు, ఎన్‌.జి.ఓలు, మ‌హిళా సంఘాల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటుచేసి నిరుప‌యోగ వ‌స్తువుల‌న్నింటిని జిహెచ్ఎంసికి అంద‌జేయాల‌ని విజ్జ‌ప్తి చేయ‌నున్నారు. కాగా ఈ నిరుప‌యోగ‌వ‌స్తువుల సేక‌ర‌ణ‌కు ప్ర‌తి డివిజ‌న్‌లో ఒక స్థ‌లాన్ని ఎంపిక చేసి ఆయా స్థ‌లాల‌కు ఈ వ‌స్తువుల‌ను తెచ్చి వేయ‌వ‌చ్చ‌ని కూడా జిహెచ్ఎంసి ఏర్పాటు చేస్తోంది.

Related Posts