YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవిశ్వాసానికి సహకరిస్తాం..

Highlights

  • విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలి
  • ఏపీ హక్కుల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తాం
  • లాలూచీ పడితే చరిత్ర హీనులవుతారు
  • ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు
     
అవిశ్వాసానికి సహకరిస్తాం..

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా సహకరిస్తామని, తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం అసెంబ్లీలో  ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా.. మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే, మా టీడీపీ ఎంపీలందరూ సహకరిస్తారని చెప్పారు. అవిశ్వాసం పెట్టేవాళ్లు ఒక వేళ లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘కొన్ని రాజకీయపార్టీలు, వ్యక్తులు లాలూచీ పడి మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఎక్కడ లాలూచీ పడుతున్నారనే విషయాలను రేపో ఎల్లుండో చెబుతాను. ‘మనమే తెలివైన వాళ్లం’ అని ఎవరైనా అనుకుంటే కుదరదు
.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం రాజీపడబోమని అన్నారు. విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎవరు పోరాడినా వారికి సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు. 
 

Related Posts