YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్రభుత్వం చేత కాని వల్లే అసమర్ధత
విజయవాడ, అక్టోబరు 23, 
ప్రభుత్వం అతి దరిద్రమైన ఆర్థిక పరిస్థితిని వారసత్వంగా ఇచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ డిస్కంలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా.... బాకీలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. చెప్పినదాని కంటే ముందుగానే తమ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులకు సున్నావడ్డీ రుణాలు, ఇన్యూరెన్స్‌ ఇస్తున్నామని వెల్లడించారు. మద్యం షాపులు తగ్గించామని తెలిపారు. సీఎం జగన్‌ హామీలన్నీ నెరవేరుస్తుంటే చంద్రబాబు ఓర్వలేక తన ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చంద్రబాబు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.‘గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేసి.. వాటిని మాపై నెట్టి విమర్శిస్తున్నారు. విద్యుత్‌ డిస్కంలను నష్టాల్లోకి నెట్టారు. విద్యుత్‌ను అధిక ధరకు కొన్నామని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక నుంచి థర్మల్ విద్యుత్ కొనుగోలు కోసం 2018 అక్టోబర్‌లో ఒప్పందం చేసుకున్నది టీడీపీ ప్రభుత్వమే. సౌర, పవన విద్యుత్‌లు అన్ని సమయాల్లో రావని టీడీపీ నేతలకు తెలియదా’ అని బుగ్గన ప్రశ్నించారు. అదే విధంగా ఇసుక సమస్యకు చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడే కారణమని విమర్శించారు. ప్రస్తుతం వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు, యనమల, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. 

Related Posts