
పడకేసిన పారిశుధ్యం ఆసుపత్రుల పాలవుతున్న జనం
అయిజ అక్టోబర్ 23
అయిజ పట్టణంలోని వివిధ వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య, డ్రైనేజీలు, రహదారుల అద్వాన్న పరిస్థితులను మెరుగు పరచాలని కోరుతూ 9వ వార్డు కు చెందిన మహిళలు వీధి ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వీధుల్లో నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక పశువైద్యశాల నుంచి బలిజిపేట కు వెళ్లే 20 ఫీట్ల రహదారి కంప తారచెట్లతో మూసుకుపోయి, రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తూ ప్రజలు అటువైపు తిరిగేందుకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని వారు అన్నారు. ఇప్పటికే ఆ వీధి ప్రజలు తీవ్ర అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల పాలవుతున్న సంగతిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్త బస్టాండ్లో డ్రైనేజీ కోసం తవ్వుతున్న మట్టిని తీసి వివిధ వీధుల్లో గోతులుపడిన రోడ్లకు వేసే వీలుంది. కానీ ఆ కాంట్రాక్టర్ విలువైన మట్టిని తవ్వి ప్రైవేటుగా అమ్ముకుంటున్నారని దీనివల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండటంలేదని వారు అన్నారు.
అదే మట్టిని తీసి ప్రస్తుతం గుంతలు పడినరోడ్లో నింపాలని వారు అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ సునీత మాట్లాడుతూ, తమ సిబ్బందిని వెంటనే తొమ్మిదో వార్డుకు పంపి తక్షణ చర్యగా రోడ్లపై మొరం వేయించి కంపచెట్ల తోమూసుకుపోయిన రోడ్డును జెసిబి పెట్టివెంటనే తొలగించే విధంగా చూస్తాననిహామీ ఇచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల మధుసూదన్ రెడ్డి సెక్షవలి ఆచారి, నవతచంద్రశేఖర్ రెడ్డి,సాంబశివుడు, బసవరాజు, సూర్య వర్ధన్ రెడ్డి, ఫిరోజ్, చాకలిరమేష్, వెంకటేష్, శాలు, గిరి, చిన్న తదితరులు పాల్గొన్నారు.