ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల అక్టోబర్ 23
చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడంతో పాటు ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందిపై భౌతిక దాడులకు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. ఆదివారం ఓ ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్,డ్రైవర్ సిబ్బంది పై దాడి చేసిన కేసులో సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.ఆర్టీసి సిబ్బంది సమ్మెతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చేందుకు గాను ఆర్టీసి యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగులు నియమించి వారి ద్వారా ప్రజలకు రవాణా సౌక్యరాన్ని ఏదావిధిగా కోనసాగించడం జరుగుతోందని,వారి విధులకు ఎలాంటి ఆటంకం కల్గించ రాదన్నారు.
ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై సమ్మేకారులు భౌతికదాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిబ్బంది ఈ చర్యలకు పాల్పడటంతో సంబంధిత పోలీసు స్టేషన్ల పరిధిలో వారి పై కేసులను నమోదు చేయడంతో పాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు