దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు చెక్ పడినట్టేనా
ఒంగోలు,
రాజకీయాల్లో తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలతన్నేవాడు ఇంకొకడుంటాడని అంటారు. ప్రకాశం జిల్లా రాజీకయ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరుగుతోందా ? వారు వేసుకున్న వ్యూహానికి ఇటు వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రతివ్యూహం అమలు చేస్తున్నారా? దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ తర్జన భర్జన పడుతోందా ? ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగినా.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. జగన్ పూర్తిగా సక్సెస్ అయినట్టేనా ? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. దగ్గుబాటి ఫ్యామిలీలో పురందేశ్వరి, వెంకటేశ్వరరావులు చెరొక పార్టీలో ఉన్నారు.ఎన్నికలకు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు . ఎన్నికలకు ముందు నుంచి అంటే 2014 నుంచి కూడా పురందేశ్వరి కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరి చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఈ రెండు పార్టీల నుంచి కూడా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. ఇద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. అయితే, ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ పురందేశ్వరితో జగన్ ప్రభుత్వంపై కామెంట్లు కురిపిస్తోంది . బీజేపీలో ఏదో ఒక పదవిని ఆశిస్తున్న పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వంపై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్లను ఇదే పార్టీలో ఉన్న భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖండించడం లేదుదీంతో చిర్రెత్తుకొచ్చిన జగన్.. ఉంటే ఒకే పార్టీలో ఉండడి! అంటూ ఆదేశాలు జారీ చేశారన్నది వైసీపీ వర్గాలే చెపుతున్నాయి. అంటే మీరు పార్టీలో ఉన్నా… వెళ్లినా ఇష్టమేననే సంకేతాలు ఇచ్చేశారు. అదేసమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి ప్రతిగా ఇక్కడ నాయకత్వాన్ని రెడీ చేసుకుంటున్నారు. అదే సమయంలో పురందేశ్వరి వస్తే.. రాజ్యసభ సీటుఇస్తామని చెప్పారు. ఒకవేళ జగన్ ఇచ్చిన ఆఫర్‌కు ఈ కుటుంబం ఫిదా అయితే.. ఈ కుటుంబం మొత్తం వచ్చి జగన్ చెంతకు చేరిపోవాలి. లేదంటే.. ఈ ఫ్యామిలీ గుండుగుత్తుగా కమలాని కి జైకొట్టాలి. ఎలా జరిగినా.. జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వైసీపీ లోకి వస్తే ఎలా ఉంటుంది? బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది? అన్న అంశాలపై చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతు న్నారు. బీజేపీలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి డోర్ క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్ చెప్పిన ఆఫర్ విన్న పురంధరేశ్వరి రాజ్యసభసభ మెంబర్ గా అవకాశమని ఎగిరి గంతెయ్యటానికి అవకాశం లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలో ఏపీ కి సంబంధించి మహిళా కీలక నాయకురాలిగా పురందేశ్వరి ఉన్నారు.అంతేకాదు ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఆమె వైసీపీలో కొనసాగటం ఒకింత కష్టమే అని ఆమె భావిస్తున్నారట. ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద విమర్శలు చేస్తున్న పురందేశ్వరి ఒక్కసారిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి జై కొట్టే ఆలోచనలోనూ లేరు.ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం రాజకీయాలు ప్రకాశంజిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా మారాయి. మరి ఈ ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్తుందా లేక పదవికి ఆశపడి.. వైసీపీలోకి వస్తుందా ? చూడాలి. ఏది జరిగినా.. జగన్ పూర్తిగా సక్సెస్ అయినట్టేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి .