నేడు " రామ ఏకాదశి "
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.
నేడు రామ ఏకాదశి. ఆశ్వీయుజ మాసములో వచ్చే విశిష్టమైన తిథి ఆశ్వీయుజ కృష్ణ ఏకాదశి. పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయణ చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించండి. మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడతాడు అంతేకాక విశేషంగా సిరిసంపదలను పొందుతారని శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుకి బోధించారు - బ్రహ్మ వైవత్తర పురాణం.
ఏకాదశి రోజున చేయవలసినవి
దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.
రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.
మద్యపానం, మాంసాహారం* వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.
ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
హరినామ స్మరణం-సమస్తపాపహరణం
ఓం నమో నారాయణాయ