YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

డెంగ్యూపై హైకోర్టు ఆగ్రహం..

డెంగ్యూపై హైకోర్టు ఆగ్రహం..

డెంగ్యూపై హైకోర్టు ఆగ్రహం..
హైదరాబాద్ 
తెలంగాణలో డెంగ్యూ మరణాలపై  హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  30 రోజుల ప్రణాళికలో మీరు ఒరగబెట్టింది ఏంటి? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి.. వాస్తవరూపం లేదని అసహనం వ్యక్తం చేసింది. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయని పేర్కొంది.. ఇక, జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్ నాటికి 3800 కు పెరిగాయన్న హైకోర్టు.. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించింది. గురువారం నాడు ఈ వ్యవహారంపై కోర్టుకు హజరయిన తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున నివారణ చర్యలు తీసుకున్నామని అయన  చెప్పారు. తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై గురువారం న్యాయస్థానం విచారించింది. 
అయితే, నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు సూటిగా సీఎస్ ను ప్రశ్నించింది.. సీఎస్ మాటలు.. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉందన్న హైకోర్టు.. డెంగ్యూ మరణాలపై తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని స్పష్టం చేసింది.. ఇక, ఉన్నతాధికారులు మూసీని సందర్శించాలని సూచించిన హైకోర్టు.. మూసీని సందర్శించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా నదల మధ్యే నగరాలున్నా ఇలాంటి పరిస్థితి లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని, ఇక నుంచి సుమోటాగా కేసులు స్వీకరించాల్సి వస్తుందని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సూచించింది. 

Related Posts