YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాక్షి దుష్ప్రచారం 

సాక్షి దుష్ప్రచారం 

సాక్షి దుష్ప్రచారం 
అమరావతి 
అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి పత్రిక అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  మండిపడ్డారు. గురువారం నాడు ట్వీట్టర్ లో అయన సాక్షి పై విరుచుకపడ్డారు. ముఖ్యమంత్రి జగన్  ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో వున్న సాక్షి, మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది.  ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను. ఐదేళ్ల ఏపీసర్కారు ప్రోటోకాల్ ఖర్చు నాకు జమ వెయ్యమని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా? ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా అని ప్రశ్నించారు. చిల్లర కథనాలు అపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఉడదిసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్ళు.  సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసిందని ఆరోపించారు.  ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు.  అక్టోబర్ 30, 2018న నేను పొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170లు బిల్లును కూడా నా అకౌంట్లో వేశారు.  విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం  సాక్షిలాంటి  నీతిమాలిన  మీడియాకే  సాధ్యమని అయన అన్నారు.

Related Posts