రిమ్స్ ను సందర్శించిన మంత్రి అళ్ల
ఒంగోలు
ప్రకాశం జిల్లా రిమ్స్ ఆసుపత్రిని మంత్రి ఆళ్ల శ్రీనివాస్ సందర్శించారు.ఒంగోలుకు వచ్చిన ఆయన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి రిమ్స్‌ను విజిట్ చేశారు.అనంతరం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ముందుగా అన్ని విభాగాలను పరిశీలించి.. చికిత్స పొందుతున్న వారిని తాగునీరు, పారిశుద్ధ్యం, మందులు, వైద్యం తదితరాల గురించి ఆరా తీశారు. కొంత మంది తాగునీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. కొందరు వైద్యులు గుంటూరు నుంచి రోజూ వచ్చిపోతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని... ఇకపై ఇక్కడే నివాసం ఏర్పరుచుకుని అన్ని వేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.