ప్రపంచ సాహిత్యంగా భారతీయ సాహిత్యం పేరుగాంచిందని ఆచార్య గ్రాహం హుగ్గన్ వెల్లడించారు. ఆంగ్లం, విదేశీభాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో సాహిత్యంపై అంతర్జాతీయ స్థాయి సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా యూకేకు చెందిన విశ్వవిద్యాలయం ఆచార్యుడు గ్రాహం హుగ్గన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస దేశాలకు చెందిన రచయితలు ఆయా దేశాల సాంస్కృతిక అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇఫ్లూలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వర్సిటీ ఉపకులపతి సురేష్‌కుమార్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆచార్యులు అలిరాజమున్షి, రమాదేవి, చిన్నాదేవి తదితరులు పాల్గొన్నారు.