YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు
వరంగల్ అర్బన్ ,
ఈ నెల 26,27 తేదిలలో ఖాజీపేటలోని  హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం  వినయ్ భాస్కర పేర్కొన్నారు. గురువారం  ఈ దర్గాను దర్శించుకొని, దర్గా పరిసరాలలో రూ.45  లక్షల తో అభివృద్ది చేస్తున్న రుసూల్  ఖానాకు శంఖుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ముస్లిం కుటుంబాలకు  అంతిమ సంస్కారాలు  ఖురాన్ బోధనలకు అనుగుణంగా నిర్వహించుటకై ఏర్పాటు చేస్తున్న మొదటి రుసూల్ ఖానా ఇదేనని తెలిపారు. సౌది అరేబియాలో ఇటువంటి సాంప్రదాయం ఉన్నదని వివరించారు. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాల గురించి  అన్ని శాఖల అధికాకులతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఖాజీపేట దర్గా లో సమవేశాన్ని నిర్వహించారు. దేశ,విదేశాలకు చెందిన లక్షలాది మంది భక్తులు ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఇది మూడవ అతి పెద్ద ఉర్సు ఉత్సవం అని తెలిపారు.   వరంగల్ నగారనికి 2 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని తెలిపారు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట్ లతో ట్రైసిటిగా మతసామరస్యానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో జరుపుకునే ఉర్సు ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని తెలిపారు. 163 సంవత్సరాల చరిత్ర ఈ దర్గాకు ఉన్నదని  తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా సామరస్యంతో వేడుకగా జరుపుకునే ఉర్సు ఉత్సవాలతో ఖాజీపేటకు ప్రత్యేక గుర్తింపు  లభించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నఅత్యంత వైభవంగా నిర్వహించుటకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే ప్లాస్టిక్ వలన పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని నివారించుటకు ఖాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలను ప్లాస్టిక్  రహితంగా జరుపుటకు సహకరించాలని రాజకీయ  పార్టీలకు, స్వచ్చంధ సంస్థలకు, ఉత్పవ కమిటి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ప్లెక్సీలు, ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా నిషేదిస్తున్నట్లు  తెలిపారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించిన అధికారులు, కార్పోరేటర్లపై  కూడా అపరాధ రుసుం విధించాలని నగరపాలక సంస్థ అధికారులను  ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేదం పై భక్తులను చైతన్యపరచాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్న గృహాలకు సమృద్ధిగా త్రాగునీటిని సరఫరా చేయాలని  ఆదేశించారు. నిరంతరాయంగా  విద్యుత్ ను సరఫరా చేయాలని సూచించారు. దర్గా ప్రాంతంలో అదనంగా సి.సి కెమెరాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్  ను క్రమబద్దీకరించాలని పోలీసులకు సూచించారు. ఉత్పవాల సందర్భంగా  ప్రత్యేక వైద్య శిభిరాలను నిర్వహించాలని డి.ఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు.  ఈ నెల 28న ఉర్సు ముగింపు బదవా వేడుకలు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రోపాషా, దర్గా వారసులు భక్తుయార్ బియాబాని, మన్సూర్ పాషా, 36వ డివిజన్ కార్పొరేటర్ అబు బకర్, ఉత్సవ కమిటి సభ్యులు ఫాజిల్, ఖాజీపేట తహసిల్దార్ నాగేశ్వర్ రావు, నగరపాలక సంస్థ ఇఇ-లక్ష్మా రెడ్డి, డా.హరీష్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts