పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ విరాళం అందజేత
జగిత్యాల
కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల సర్పంచ్ లకు ప్రభుత్వం ప్రకటించిన గౌరవవేతనం ప్రతినెల 5000 రూపాయల చోప్పున 5నెలల వేతనం 25,000 రూపాయలు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్ ,చైర్మన్ రాజశేఖర్ లకు పాఠశాల అభివృద్ధి కొరకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల దీటుగా మన గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసుకుని అన్ని రకాల సదుపాయాలు పాఠశాలలో సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనతడుపుల వసంత స్వామి మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ ఖయ్యిం, రైతు సమన్వయ అధ్యక్షుడు చిట్టిరెడ్డి, నారాయణ బోదుకం సుధాకర్, నాగరాజు, రవీందర్, జలెందర్ రెడ్డి, కేర్తి రవి, సాగర్ రెడ్డి, గ్రామ కారోబార్ లక్ష్మీనారాయణ, గణేష్, రాజగంగరాం, శ్రావణ్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు