YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దుమ్ము రేపిన భారత్

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దుమ్ము రేపిన భారత్

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దుమ్ము రేపిన భారత్
న్యూఢిల్లీ, 
భారత్ దుమ్మురేపుతోంది. ప్రధాని మోదీ సారథ్యంలో అంతర్జాతీయ వేదికపై దూసుకెళ్తోంది. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) భారత్ మళ్లీ సత్తా చాటింది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్ట్‌లో ఇండియా ర్యాంక్ ఏకంగా 14 స్థానాలు మెరుగుపడింది. 63వ స్థానానికి ఎగబాకింది.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మెరుగుపడటానికి ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన మేకిన్‌ ఇండియా కార్యక్రమం సహా పలు ఇతర సంస్కరణలు కూడా కీలక పాత్ర పోషించాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి ఎంతగానో దోహపడింది. ర్యాంక్ బాగా మెరుగపడిన టాప్‌ 10 దేశాల సరసన భారత్ వరుసగా మూడోసారి స్థానం దక్కించుకోవడం గమనార్హం.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనంలో ఉండటం, అలాగే భారత్ వృద్ధి రేటు కూడా ఇటీవలనే ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మెరుగు పడటం విశేషం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా పలు రేటింగ్‌ ఏజెన్సీలు దేశీ వృద్ధి రేటును తగ్గించిన విషయం తెలిసిందే.ఇకపోతే మోదీ దేశ ప్రధాని అయినప్పుడు భారత్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంక్ 142గా ఉంది. తర్వాత 2018లో భారత్‌ ర్యాంక్‌ తొలిసారిగా 100కు చేరింది. కేంద్ర ప్రభుత్వపు వివిధ సంస్కరణల నేపథ్యంలో గతేడాది భారత్‌ ర్యాంక్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 77కు చేరింది. ఇప్పడు ర్యాంక్ 63కు ఎగసింది.ప్రస్తుత సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు గణనీయంగా మెరుగుపడిన టాప్‌ 10 దేశాల జాబితాలో భారత్‌ సహా సౌదీ అరేబియా (62), జోర్డాన్‌ (75), టోగో (97), బహ్రెయిన్‌ (43), తజికిస్తాన్‌ (106), పాకిస్తాన్‌ (108), కువైట్‌ (83), చైనా (31), నైజీరియా (131) ఉన్నాయి. 

Related Posts