YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఇంటికి కేంద్ర మంత్రి సదానంద 

జగన్ ఇంటికి కేంద్ర మంత్రి సదానంద 

జగన్ ఇంటికి కేంద్ర మంత్రి సదానంద 
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌‌రెడ్డి నివాసానికి కేంద్రమంత్రి సదానంద గౌడ్ వెళ్లారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు కేంద్రమంత్రి తాడేపల్లిలోని ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా సదానందను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏపీ సీఎం ఆతిథ్యాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. తర్వాత అక్కడి నుంచి తిరిగి బయల్దేరారు.అంతకముందు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌)ను సీఎం జగన్, కేంద్ర మంత్రి సదానంద గౌడలు ప్రారంభించారు. సీపెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం చేసిన తొలిరాష్ట్రం ఏపీనే అన్నారు. సీపెట్‌ లాంటి సంస్థలు మరిన్ని రావాలని.. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఏపీలో సీపెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అందించిన సహకారం అభినందనీయం అన్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయని.. మన యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటామని ఆకాంక్షించారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని.. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సీపెట్‌ కేంద్రాలు ఉన్నాయని.. మరో ఐదుచోట్ల సీపెట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Related Posts