YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు బంపరాఫర్

బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు బంపరాఫర్

బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు బంపరాఫర్
న్యూఢిల్లీ, 
ఎస్ఎన్‌ఎల్ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీలను గట్టెక్కించడానికి దాదాపు రూ.70,000 కోట్లతో పునరుద్ధరణ ప్రణాళికను వెల్లడించింది. వచ్చే 3-4 ఏళ్లలో కంపెనీలను లాభాల్లో నడిపించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్,  ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగుల కోసం రూ.30,000 కోట్లతో వీఆర్ఎస్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. 50 ఏళ్లకు పైన ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. వీఆర్ఎస్ ప్యాకేజ్‌ను ఎంచుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల వేతనాన్ని అడ్వాన్స్ రూపంలో ముందుగానే చెల్లిస్తుంది. కాగా కంపెనీ ఉద్యోగులు ఇటీవలనే వేతనాలు ఆలస్యం అయ్యాయని ధర్నా చేసిన విషయం తెలిసిందే.వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్- VRS) అనేది ఉద్యోగుల నచ్చితేనే తీసుకోవచ్చని, ఎలాంటి ఒత్తిడి ఉండదని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2019 జూన్ నివేదిక ప్రకారం బీఎస్ఎన్ఎల్‌ కంపెనీలో 1.16 లక్షలకు పైగా ఉద్యోగులు 50 ఏళ్లకు పైన వయసు కలిగి ఉన్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.65 లక్షలు. ఇక ఎంటీఎన్ఎల్ కంపెనీలో 19,000 మందికి పైగా ఉద్యోగులకు 50 ఏళ్లకు పైన వయసు ఉంది. ఈ కంపెనీలో మొత్తంగా 21,679 మంది ఉద్యోగులు ఉన్నారు.బీఎస్‌ఎన్ఎల్,  ఎంటీఎన్‌ఎల్ కంపెనీలు మొబైల్ బిజినెస్‌లో దాదాపు 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీలను మూసివేయమని, అలాగే డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ కూడా ఉండదని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.ఇకపోతే బీఎస్ఎన్ఎల్ కంపెనీ ఆదాయంలో ఉద్యోగుల ఖర్చులకే 77 శాతం వెళ్లిపోతోంది. అలాగే ఎంటీఎన్ఎల్ ఆదాయంలో సిబ్బంది కోసం ఏకంగా 87 శాతం ఖర్చవుతోంది. కాగా బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది

Related Posts