YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రూరల్ లో క్లీన్ స్వీప్ పై కోటంరెడ్డి గురి

రూరల్ లో క్లీన్ స్వీప్ పై కోటంరెడ్డి గురి

రూరల్ లో క్లీన్ స్వీప్ పై కోటంరెడ్డి గురి
నెల్లూరు, అక్టోబరు 25, (న్యూస్ పల్స్)
నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో… పార్టీ పటిష్టతకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కా పొలిటిషియన్. ఎందుకంటే ఆయన రెస్ట్ అనేదితీసుకోరు. నిత్యం ప్రజల్లో ఉండే నేత. అందుకే రెండు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే ఆయన దూకుడు స్వభావం కొన్ని సార్లు వ్యక్తిగతంగా, పార్టీకి నష్టం తెచ్చిపెట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరును మాత్రం ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేరు.ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ ఒక్కటే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీని అడ్రస్ లేకుండా చేయడం. గత కొద్దిరోజులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేపనిలో ఉన్నారు. టీడీపీలో బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన 90 శాతం మంది నేతలు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బాగా వెనకేసుకున్న వారు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ అనుచరులు సయితం కోటంరెడ్డి చేత కండువా కప్పించేసుకోవడం విశేషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 26డివిజన్లు, 13 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు వీటిలో 90 శాతం మంది సర్పంచ్ లు, కార్పొరేటర్లు వైసీపీలో చేరిపోయారు.మరోసారి గెలిచిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలోనే ఉన్నారు. ఇప్పటికే కార్పొరేటర్లు, సర్పంచ్ ల స్థాయి నేతల వరకూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేతలు బుజ్జగించినా వారు కోటంరెడ్డి వెంటనే నడుస్తామని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కోడూరు కమలాకర్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీత్ కు సన్నిహితులు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వేమిరెడ్డి అశోక్ రెడ్డి వంటి నేతలు టీడీపీని వీడారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తన పరిధిలో పార్టీకి పూర్తి స్థాయి విజయం సాధించిపెట్టాలన్నది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహం. అయితే ఇందుకు మరో కారణం రెండున్నరేళ్ల తర్వాత జరగనున్న మంత్రి వర్గ విస్తరణ.స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచూపితేనే తనకు జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందన్నది తెలియంది కాదు. అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. అయితే పార్టీలో తొలి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, పదవులు కూడా వస్తాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. వైసీపీ పాలన చూసి వారంతట వారే తమ పార్టీలోకి వస్తున్నారని చెబుతున్నారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిందనే చెప్పాలి. ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో కోటంరెడ్డికి పని సులువుగా మారింది.

Related Posts