YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో మున్సిపోల్స్

తెలంగాణలో మున్సిపోల్స్

తెలంగాణలో మున్సిపోల్స్
హైద్రాబాద్, 
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమవుతోంది. చాలా రోజులుగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటి పైన దాదాపు ఆరు నెలలకు పైగా విచారణ సాగుతోంది. అయితే, హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఓటర్లు లిస్టులో అక్రమాలు.. వార్డుల విభజన..రిజర్వేషన్ల అంశాల పైన హైకోర్టు ముందు వాదనలు జరిగాయి. దీంతో..కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో..ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం సిద్దంగా ఉన్న ప్రభుత్వం ఇక దీని పైన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టులో మున్సిపల్ ఎన్నికల విషయంలో కీలక తీర్పు వెలువడింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను తమ అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అనేక పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటి మీద సుదీర్ఘంగా చర్చలు..వాదనలు సాగాయి. అయితే, వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలోని మొత్తం 128 మున్సిపాల్టీలు..13 కార్పోరేషన్లు ఉన్నాయి.అందులో 75 మున్సిపాల్టీలకు సంబంధించి గతంలో కోర్టు స్టే ఇచ్చంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో గతంలో సింగ్ బెంచ్ ఇచ్చిన 75 మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణ కోసం స్టే వెకేట్ చేయించుకోవాలని సూచించింది. మిగిలిన 53 మున్సిపాల్టీలకు మాత్రం హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆలోచన ఏంటి... తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే, సుదీర్ఘంగా కోర్టుల్లో ఉన్న కేసులు..వాదనల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. అయితే, ప్రభుత్వం..రాష్ట్ర ఎన్నికల సంఘం తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు 53 మున్సిపాల్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 75 మున్సిపాల్టీల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుంది. దీంతో..ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టీలకు కలిసి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కొన్ని నగర పంచాయితీలను ప్రభుత్వం మున్సిపాల్టీలుగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రిజర్వేషన్లు..ఓటర్ల లిస్టులో అక్రమాలు.. వార్డుల విభజన పైన కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో ప్రభుత్వం తీసుకుబోయే నిర్ణయం కీలకం కానుంది

Related Posts