Highlights
- రష్యాలోని విమానాశ్రయంలో ఘటన
- 9.3 టన్నుల బంగారు కడ్డీలు తీసుకెళ్తున్న విమానం
- డోర్ తెరుచుకోవడంతో కింద పడిన 3.4 టన్నుల బంగారు కడ్డీలు
విమానంలో తరలిస్తున్న బంగారు కడ్డీలు ఆకాశం నుంచి వర్షంలా జారిపడ్డాయి. సుమారు మూడు టన్నుల బరువుగల బంగారు కడ్డీలు విమానం నుంచి రన్ వైపై చెల్లాచెదురుగా పడ్డాయి.రష్యాలోని యకుస్క్ ప్రాంతంలో విమానాశ్రయం నుంచి నింబస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఆన్-12 కార్గో విమానం ఖరీదైన లోహాలతో క్రస్నోయాస్క్ బయల్దేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం డోర్ తెరుచుకోవడంతో బంగారపు కడ్డీలు జలజలా జారిపడ్డాయి. ఈ కడ్డీలు మొత్తం 172 అని, వాటి బరువు 3.4 టన్నులని అధికారులు నిర్ధారించారు. విమానంలో మొత్తం 9.3 టన్నుల బంగారం ఉందని.అందులోంచి కొంత కిందపడిందని పేర్కొంటున్నారు.