అయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ వుండవు
నాగర్ కర్నూలు
ఆయుర్వేదంలో దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం పొందుతారని వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారంనాడు 4 వ అంతర్జాతీయ దినోచ్ఛవం పురస్కరించు కొని ఆయుష్ డి పర్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ధన్వాతరి ఫోటోకి జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదంలో పంచ కర్మ , క్షరా సూత్రం వంటివి బాగా ఉంటాయని దీన్ని ప్రజల్లో చైతన్యం కల్పించాలని వైద్యులను కోరారు. ఈ వైద్యం జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేస్తే వైద్యాన్ని ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కల్పించి ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే అవకాశం ఉందని వైద్య శిబిరం ఇంచార్జి డా, టి.శ్రీనివాస ప్రసాద్ జె.సి. కి కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సుపెరిండెంట్ డా, ప్రభు, క్యాంపు ఇంఛార్జి డా శ్రీనివాస ప్రసాద్ , డా, అరుణ, డా, నర్సింగ్ రావ్, ఫార్మాసిస్తులు పి.మురళి కృష్ణ, దశరథం, గోవింద్, భాస్కర్, అంజలీదేవి, సిబ్బంది ప్రభాకర్, రహీం లు పా ల్గొన్నారు.