నరక చతుర్ధశి
దితి, కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యకశ్యపుడు. ఒక సారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్రగర్భంలో దాచి పెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి, వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు...ఆ సమయములో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు.ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది.దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భుదేవి ఎంతో సంతోషిస్తుంది.తర్వాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది.ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు.
పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము (ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం.) అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు.తన రాజ్యములోని ప్రజలందరిని ఎంతో చక్కగ పరిపాలించేవాడు.ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.తర్వాత ద్వాపరయుగములో, అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఎర్పడుతుంది.బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడమును నిరసించేవాడు.అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు.అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ అపేవేసినాడు.ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు.ఆ విధముగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు.
వరాహస్వామి దేవేరి-భూదేవికి కలిగిన సంతానమే ‘నరకాసురుడు’. దేవపుత్రుడే అయినా.. పుట్టిన వేళా విశేష ఫలింతంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు ‘కామ రూపాధిపతి’గా మారతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ‘ప్రాగ్జో్యతిషం’. ఇతని వాహనం ‘సుప్రతీకం’ అనే ఏనుగు. . దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోవాసులను... దేవతలనూ విడిచి పెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. .దీంతో నరకాసురుడి ఆగడాలనుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరిి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు.
శ్రీకృష్ణుడు మొదట మురరాక్షసుని, అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసి పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు.
దీనితో తమ కష్టాలు తొలిగి పోయాయని సంతోషించి మరునాడు సకలలోక వాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి ‘దీపావళి’ పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం. పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని ‘నరకాసుర వధ ’వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సత్యభామే ఎందుకు? భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుడిని అత్యంత బలవంతుడిగా మార్చుతాడు. ‘నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమౌతాడు’ అని వరమిస్తాడు. నరకాసురుడి అకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోక వాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు. కానీ కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుడిని వధించమని కోరుతాడు. నరకాసురుడిని వధించడానికి బయల్దేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు.నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములో వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.