కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవై రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం కొత్తగూడెం లో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ డిపో ఎదురుగా బైఠాయించి ధర్నా చేశారు. తాత్కాలిక కండక్టర్లను డ్రైవర్లను వెళ్లిపొమ్మని తమ నోటి దగ్గర అన్నం తీయవద్దని వేడుకొని వారిని బయటకు పంపించివేసారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపో లో కొన్ని బస్సులు మాత్రమే బయటికి వెళ్లడం జరిగింది. దీనితో బస్టాండ్ ఆవరణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది మహిళా కండక్టర్ ఆర్టీసీ డిఎం ఛాంబర్ కి వెళ్లి అక్కడ పనిచేస్తున్న తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్ ను బయటికి వెళ్లి పొమ్మని ధర్నా చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.