మంత్రులను అడ్డుకున్న భవన నిర్మాణ కార్మికులు
గుంటూరు
శనివారం నాడు గుంటూరు నగరంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ పర్యటించారు. నగరంలోని పోన్నురు రోడ్డు, లాంజెస్ట్ రోడ్డు, యాదవ్ హైస్కూల్, టూబాకొ కంపేనీ రోడ్డులను పరీశీలించారు. తరువాత బోత్స మీడియాతో మాట్లాడారు. భూగర్భ డ్రైనేజీ పనులు వచ్చే నెలతో పూర్తవుతాయని అన్నారు. పనులు మాత్రం 50శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. గుత్తేదార్లను మార్చాలనే ఆలోచన మాకు లేదన్నారు. ప్రతి పని రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదన్నారు. ఇక్కడ 50శాతం పనులు జరిగాయి కాబట్టే ఆ పరిస్థితి లేదన్నారు. అమరావతిలో 9 వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. రూ 5400 వేల కోట్ల పనులు పుర్తాయ్యాయి. రూ 40 వేల కోట్ల క టెండర్లు పిలిచాం. రూ 30 వేల కోట్ల పనుల్లో అవినీతి జరిగిందని నేను ఎక్కాడా చెప్పలేదని బోత్స అన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాత్రమే చెప్పానని అన్నారు.
బొత్స కాన్వయ్ ని పట్నం బజార్ లో భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక కొరతపై నిలదీశారు. మీకు ఓటు వేశాము.. మాకు ఇసుక ఇవ్వండని కార్మికులు కోరారు. . మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు మంత్రులతో వాగ్వాదానికి దిగారు.ఇసుక కొరతతో పనులు అల్లాడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని మంత్రులను నిలదీసారు. పోలీసులు రంగంలో దిగి కార్మికులను తప్పించారు. వెంటనే కార్లు ఎక్కి మంత్రులు వెళ్లిపోయారు.