
ఏపీ గవర్నర్ దీపావళీ శుభాకాంక్షలు
అమరావతి
శాంతి, మతసామరస్యానికి, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం కావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపావళి నిలుస్తోందన్నారు. దీపావళిని ప్రజలంతా రంగురంగుల దీపాలను వెలిగించి జరుపుకోవాలన్నారు.