మంత్రి అవంతి ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు
విశాఖపట్నం
ఏపీ మంత్రులకు ఇసుక సెగ తగిలింది. పలు చోట్ల మంత్రులను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. విశాఖలో జనసేన నేతలు, భవన నిర్మాణ కార్మికులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాంగ్ చేసారు. మంత్రికి తమ కష్టాలను కార్మికులు వివరించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇసుక మీద కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రాజకీయాల లబ్దికి వాడుకుంటున్నాయని విమర్శించారు.