YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ గల్లా జయదేవ్ కు హైకోర్టు నోటీసులు

ఎంపీ గల్లా జయదేవ్ కు హైకోర్టు నోటీసులు

ఎంపీ గల్లా జయదేవ్ కు హైకోర్టు నోటీసులు
గుంటూరు 
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాకిచ్చింది.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు గద్దె రామ్మోహన్ రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ పిటీషన్ తోపాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు నోటీసులు జారీ చేసింది.గల్లా జయదేవ్ ఎన్నికను సవాలు చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గుంటూరు ఎంపీ సీటులో హోరాహోరీ పోరు నడిచింది. కేవలం 4200 ఓట్ల మెజారిటీతోనే గల్లా విజయం సాధించాడు. 9వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రిజెక్ట్ చేయడం దుమారం రేపింది. పోస్టల్ బ్యాలెట్లతో గెలిచేవాడినని మోదుగుల కలెక్టర్ ను కోరినా పట్టించుకోలేదు. దీంతో ఇందులో పెద్ద గోల్ మాల్ జరిగిందని వైసీపీ అభ్యర్థి మోదుగుల హైకోర్టును ఆశ్రయించాడు.ఇక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి సత్యనారాయణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి హైకోర్టుకెక్కారు. వీటిపై విచారించిన కోర్టు గల్లా జయదేవ్ తో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.  దీంతో వీరి ఎన్నిక చెల్లుతుందా లేదా అన్న టెన్షన్ టీడీపీ నేతలను పట్టుకుంది.

Related Posts