YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

కాకతీయ కట్టడాలపై ప్రత్యేక శ్రద్ద

కాకతీయ కట్టడాలపై ప్రత్యేక శ్రద్ద

కాకతీయ కట్టడాలపై ప్రత్యేక శ్రద్ద
వరంగల్  అర్బన్,
తెలంగాణ ప్రభుత్వం సంస్కృతికి, చరిత్రక వైభవానికి నిలిచిన కాకతీయ కట్టడాలను పునరుద్దరించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండా  ప్రకాష్ రావు, జెడ్ పి చైర్మన్ డా.ఎం.సుదీర్ కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ  పర్యవేక్షకులు మిలన్ కుమార్ చావ్లే లతో కలిసి  హన్మకొండలోని వేయిస్తంబాల గుడి కళ్యాణ మండపం పునరుద్దరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎం.పి.గా పనిచేస్తున్న కాలంలో వేయిస్తంబాల గుడి పునరుద్దరణకు కేంద్ర పురావస్తు శాఖ రూ.3 కోట్ట 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2006 జూలై 5వ తేదిన వేయిస్తంబాల గుడి పునరుద్దరణకై  శిధిలావస్తకు చేరిన నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని వినోద్ కుమార్ వివరించారు. తదుపరి  పెరిగిన అంచనాల మేరకు మరో రూ.3కోట్ల 80 లక్షలను కేంద్ర ప్రభుత్వం విడుదల  చేసినట్లు తెలిపారు.  పెరిగిన ధరలు అను గుణంగా సవరించిన  అంచనాల ప్రకారం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రెండు విడుతలలో రూ. 7 కోట్ల 30 లక్షల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. గత 14 సంవత్సరాల నుండి పునరుద్దరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. 1000 సంవత్సరాల చారిత్రక వైభావానికి ఎలువంటి నష్టం జరుగకుండ, సిమెంట్, ఇనుములను వినియోగించకుండా స్థపతుల పర్యవేక్షణలో యధాతధంగా పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. మరో వేయి సంవత్సరాల పాటు కాకతీయ వైభావాన్ని సజీవంగా నిలిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులకు రూ.4 కోట్ల 50 లక్షల చెల్లించినట్లు తెలిపారు. 70 శాతం పనులు పూర్తిఅయినాయని తెలిపారు. సంవత్సర కాలంలో వేయిస్తంబాల గుడి  కళ్యాణ మండలం పునరుద్దరణకు పనులు 100 శాతం పూర్తి అవుతాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్ధపతులకు చెల్లింపులు చేయాలని అధికారులకు వినోద్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాలకు  పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలానికి  అనుగుణంగా ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కేటాయించిన  నిధులు కేంద్ర పురావస్తు శాఖ నుండి నిధులు విడుదల చేసినందున పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖల పర్యవేక్షణలో  నిర్మాణ పనులు జరుపుతామని అన్నారు. అధిక నిధుల గురించి కేంద్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకువెల్తామని తెలిపారు. పరాత కట్టడాలను పరిరక్షిస్తామని  అన్నారు. పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ పురాతన కట్టడాలైన రామప్ప, వేయిస్తంబాల గుడుల నిర్మాణంలో ప్రత్యేక శౌలిని కాకాతీయులు అనుపరించినట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నైపుణ్యత కల్గిందని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలు చరాత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రస్తుత వేయిస్తంబాలగుడి కళ్యాణ మండపం నిర్మాణపనులను పూర్తిచేసేందుకు తమందరం కృషి చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఇంచార్జీ కలెక్టర్ హరిత, రాష్ట్రమహిళా ఆర్ధిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్ నాయక్, స్థానిక కార్పెరేటర్ వేముల శ్రీనివాస్, తహాశీల్దార్ నాగేశ్వరరావు, పురావస్తు శాఖ సంరక్షణ సహయకులు  మల్లేశం, బండి నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.  

Related Posts