YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి
సంగారెడ్డి 
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో నియోజకవర్గ స్థాయి షాది ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి   పాల్గొన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల షాది ముబారక్,కల్యాణ లక్ష్మి 5 కోట్ల 45 లక్షల రూపాయలను  లబ్ధిదారులకు చెక్కులను నియోజకవర్గానికి కేంద్రమైన జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ మాట్లాడుతూ ఆడపిల్లను అంటే భయపడే నాటి నుంచి ఆడపిల్లనే కణాలనే పరిస్థితి ప్రస్తుతం ఉన్నదంటే అది కేవలం కెసిఆర్ ప్రభుత్వం ప్రతి మహిళకు ఇస్తున్నా ప్రోత్సాహకు భరోసా అంటూ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆడ బిడ్డ పుట్టిన నాటి నుంచి పెరిగి పెద్దయి పెండ్లి అయ్యేంతవరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కుటుంబ పెద్దగా కేసీఆర్ అడబిడ్డల పెళ్ళిలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు.నిరుపేద కుటుంభలకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్మి ,షాదిముభారక్ చెక్కులు వరంలాంటిదని అన్నారు.పేదల సంక్షేమాన్ని కోరుకుంటున్న  కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం అని ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం చదువుల సరస్వతి నిలయంగా మారిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.నేటి సమాజంలో ఆడపిల్ల అంటే భయం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికల్లో ఎంత మంది పాల్గొన్నారు అంటూ సభలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి ప్రశ్నించారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధి కి చోటు ఇవ్వకుండా ఉంటుందంటూ గుర్తు చేశారు. నియోజకవర్గం లో ఇప్పటివరకు 12 కోట్ల రూపాయలు షాది ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో ఇచ్చాము అంటూ చెప్పుకొచ్చారు.కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయితో స్టేజిపై మాట్లాడారు.అ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి రూపంలో ఇస్తున్న డబ్బు పేదలకు ఎంతో ఉపయోగం పడుతున్నాడి అంటూ ఆ అమ్మాయి ఎమ్మెల్యేకు వివరించారు.తెలంగాణ ప్రభుత్వానికి అ అమ్మాయి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల్లో తహసీల్దార్లు మండల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts