YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రత్యేక పారిశుద్ధ పనులలో సుందరీకణ

ప్రత్యేక పారిశుద్ధ పనులలో సుందరీకణ

ప్రత్యేక పారిశుద్ధ పనులలో సుందరీకణ
నాగర్ కర్నూలు 
నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని,  జిల్లా కలెక్టర్, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఇ. శ్రీధర్, కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి ని ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కమిషనర్ తో సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ 20 వార్డులు విలీనమైన గ్రామాల పారిశుద్ధ్య పరిస్థితులపై కలెక్టర్ శ్రీధర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణంలోని అన్ని వార్డుల్లో చెత్త తరలించడానికి ఎన్ని వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల, తదితర విషయాలు మున్సిపల్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రజల సహకారంతో పరిసరాలను, శుభ్రపరచడం కంప చెట్లను తొలగించడం, ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడదీసి సేకరించడం, ఇలా సేకరించిన పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ చేయించడం, తడి చెత్తను కంపోస్టుగా తయారు చేసి ఆదాయవనరుగా మలుచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.
పట్టణంలో ప్రజలకు అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే నష్టాలను వివరించి, డెంగ్యూ వ్యాధి సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన తేదీల్లో వారం రోజుల పాటు వైద్యఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, మునిసిపల్ మెప్మా అధికారులు మరియు మహిళా సంఘాలు  వార్డుల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని వీధిలైట్లు మరియు విద్యుత్ సమస్యలను విద్యుత్ అధికారులు ఈ వారం రోజుల పాటు అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖను కలెక్టర్ ఈ శ్రీధర్ ఆదేశించారు.
నాగర్ కర్నూలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు పరిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని పారిశుద్ధ్యంపై సిబ్బంది అలసత్వం లేకుండా చూడాలని కలెక్టర్ కమిషనర్ ను ఆదేశించారు.  సోమవారం 28వ తేదీ నుండి నవంబర్ 4వ తేదీ సోమవారం వరకు ఏ.ఏ వార్డుల్లో ఏ రోజు నిర్వహించాలో తేదీలను ఖరారు చేశారు.
నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని అదేవిధంగా ఇంట్లో ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని నాగర్ కర్నూల్ పట్టణాన్ని పరిశుభ్రంగా సుందరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని పట్టణ ప్రజలకు కలెక్టర్ ప్రజలకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

Related Posts