Highlights
- కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం
- అవిశ్వాసం నోటీస్ ఇవ్వాలని ఎంపీ తోట నర్సింహంకు ఆదేశాలు
నిన్నటి వరకూ తమ అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆశించి.. మద్దతిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించడంతో హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవాలన్న వైసీపీ ఆశలపై తాజా నిర్ణయంతో నీళ్లు చల్లినట్టైంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ డైలమాలో పడింది. వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని భావించే చంద్రబాబు మద్దతుపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏతో కూడా తెగతెంపులు చేసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. సాయంత్రం ఈ నిర్ణయాన్ని చంద్రబాబు అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.
BJP has cheated Telugu people, this time also they have succeeded in doing so, we will be moving a no-confidence motion (in the Parliament): KS Jawahar, Andhra Pradesh Minister pic.twitter.com/10jwZaPDiZ
— ANI (@ANI) March 16, 2018