YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

పనిచేయవ్.. (తూర్పుగోదావరి)

పనిచేయవ్.. (తూర్పుగోదావరి)

పనిచేయవ్.. (తూర్పుగోదావరి)
కాకినాడ, : రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రుల్లోని సి.టి. స్కానింగ్‌ యంత్రాలు మాత్రం తరచూ మొరాయిస్తుండడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలోని సి.టి. స్కానింగ్‌ యంత్రాన్ని 2012లో రూ. రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సేవలందిస్తూ.. సాంకేతిక సమస్యలతో మరమ్మతులకు గురవుతోంది. రోజుకు 20 స్కానింగ్‌లు తీసే సామర్థ్యం ఉన్న ఈ యంత్రంతో అంతకుమించి పని చేయిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అత్యవసర సేవలు, ట్రామా, న్యూరాలజీ, గుండె సంబంధిత సమస్యలు అధికం కావడం వల్ల రోజుకు 40 నుంచి 50 వరకు స్కానింగ్‌లు తీయాల్సి వస్తుంది. ఒక రోగికి ఈ వైద్య పరీక్ష చేయాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. అంటే 40 స్కానింగ్‌లు చొప్పున రోజుకు 13 గంటల పైనే ఈ యంత్రం పనిచేయాల్సి ఉంటుంది. దీంతో తరచూ మొరాయిస్తోంది.
కాకినాడ జీజీహెచ్‌లోని సి.టి. స్కానింగ్‌ యంత్రం గతేడాది వరకు నెలలో నాలుగైదు సార్లు మరమ్మతులకు గురయ్యేది. దీంతో విసిగిపోయిన వైద్యులు స్కానింగ్‌లను బయటకే రాసేవారు. ఇది గుర్తించిన ప్రభుత్వం ఇటీవల కొత్త యంత్రాన్ని మంజూరు చేసింది. రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. దీంతో పాటే స్కానింగ్‌లు సైతం పెరగడంతో మళ్లీ యథావిధిగా మరమ్మతులు వచ్చిపడుతున్నాయి. నెలలో ఒక్కసారైనా సమస్య వస్తోంది. ఎమ్మారై స్కానింగ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ రోగుల అవసరాన్ని బట్టి సి.టి. స్కానింగ్‌ ఉపయోగం తప్పడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ యంత్రాలపై వాటి సామర్థ్యం కంటే ఎక్కువ పనిచేయిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి గురించి అవగాహన ఉండే రేడియాలజిస్ట్‌ లేకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న సిబ్బందితోనే స్కానింగ్‌లు తీయిస్తున్నారు. వారికి పెద్దగా శిక్షణ లేకపోవడం కూడా తరచూ సమస్యలు రావడానికి కారణమవుతోంది. సి.టి. స్కానింగ్‌ను ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో చేయించుకోవాలంటే రూ. రెండు నుంచి మూడు వేల వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించడం పేద రోగులకు ఊరటనిచ్చినా.. యంత్రాలు తరచూ మోరాయించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఒకసారి పాడైతే దానిని పునరుద్ధరించే సరికి కనీసం వారం సమయం పడుతోంది. ఈ వ్యవధిలో కనీసం 200 మంది ప్రైవేటు పరీక్షా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలపై ఈ విధంగా ఆర్థిక భారం పడుతోంది.

Related Posts