సినిమాలో ఇంటర్వేల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా..? వాళ్లను అనుసరిస్తున్నారా..? అని ప్రశ్నించారు, వైసీపీ కూడా మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తోంది.. జనసేన కూడా అలాగే చేస్తోందని ఎద్దేవా చేశారు. పవన్ తన మనస్సు ఎవరి మీద అయినా పారేసుకుంటాడు.. ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకున్నాడు.. ఆ తర్వాత ఆరేసుకున్నాడని తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా మారిపోయారో అర్ధం కావడం లేదు.నిన్నటి వరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్ పక్షపాత భావజాలానికి పవన్ చేరుకున్నారు.ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్ ను పొగుడుతున్న పవన్.. కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న చంద్రబాబును విమర్శిస్తారా..?,ఎన్సీఏఈఆర్ నివేదిక ప్రకారం ఏపీ 19వ స్థానంలో ఉందన్నారు. ఇదే నివేదిక ప్రకారం గతంలో ఏపీ ఒకటో స్థానంలో ఉందని.. .ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒక వార్తా పత్రికలో కథనం వస్తే ఆ కార్యాలయం మీద దౌర్జన్యానికి ప్రయత్నించారు.తమ దాకా పరిస్థితి వస్తే ఎలా ఉంటారో పవన్ ఆలోచించుకోవాలి.మంగళగిరిలో పవన్ ఇంటి నిర్మాణం జరిగే చోట నేనూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్లు రూపాయలు ఖర్చు అవుతందన్నారు.. కానీ పవన్ కు రూ. 40 లక్షలకే ఇచ్చేశారు.సినిమా హీరో మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమో..? కానీ కాపుల విషయంలో మీరేమన్నా అధ్యయనం చేశారా..అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు వద్దని చెప్పడమేనా మీ అధ్యయనం.అని నిలదీశారు. చంద్రబాబు, లోకేషును విమర్శించడానికేనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ..వేసారా అని దుయ్యబట్టారు.వైసీపీ విమర్శలను.. ఆరోపణలను పవన్ దత్తత తీసుకున్నారా అని అన్నారు.