YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

పంచాయుధాలు – పుట్టుపూర్వోత్తరాలు

పంచాయుధాలు – పుట్టుపూర్వోత్తరాలు

పంచాయుధాలు – పుట్టుపూర్వోత్తరాలు
పాంచజన్యం: ఓ బలవంతుడయిన అసురుడు శంఖంలో నివసిస్తుంటాడు.  అందువల్ల అతనిని పంచజనుడు అని పిలుస్తారు. సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, బలభద్రుడు విద్యాభ్యాసం చేస్తుంటారు. వారి విద్యాభ్యాసం పూర్తి అవుతుంది. ఆ సంధర్భాన పంచజనరాక్షసుడు ప్రభాత తీర్థం దగ్గర స్నానం చేస్తున్న సాందీపుని పుత్రుని ఎత్తుకొని వెళతాడు. అసురుడు ఆ బాలుని తాను నివసించే శంఖంలో బంధిస్తాడు. తన పుత్రుని గురుదక్షిణగా తెమ్మని సాందీపుడు బలరామకృష్ణులను కోరతాడు. వారు నదీతీరానికి వెళ్ళీ వరుణుని ప్రార్థిస్తారు. వరుణుడు బలరామకృష్ణులకు ప్రత్యక్షమౌతాడు. వరుణుని సాయంతో బలరామకృష్ణులు పంచజనుని చంపి దక్షిణగా గురుపుత్రుని సాందీపునికి సమర్పిస్తారు.  అసురుడు నివసించిన శంఖాన్ని కృష్ణుడు జ్ఞాపికగా గ్రహిస్తాడు.  పంచజన సబంధితమైన శంఖం కాబట్టి దానికి పాచజన్య అనే పేరు వ్యవహారంలో నిలిచింది (భాగవతం – దశమస్కందం) .గోదాదేవి “నాచ్చియార్ తిరుమొళి” లోని పదిపాశురాలలో శంఖ సౌందర్యాన్ని వర్ణించింది. ధ్రువుని చెక్కిలిని భగవానుడు తన శంఖంతో స్పృశించటం విష్ణుపురాణంలో చెప్పబడింది. శ్రీ కౄష్ణుని సుందర మృదు మధురాధర స్పర్శను అనుభవించిన శంఖానిదే మహద్భాగ్యమని – ఎందరో భాగవతులు మధురభక్తి తన్మయులై తమ కవితల్లో పాంచజన్యాన్ని అభివర్ణించారు.కౌమోదకి: శ్రీకృష్ణుని గదను కౌమోదకి అంటారు.  ఈ ఆయుధం కృష్ణునికి వరుణునిచే ఇవ్వబైంది. (భారతం – ఆదిప్ర్వం – 224 అధ్యా – 23 శ్లోకం). ఈ గద ఉరుము మెరుపులను పుట్టించి ఏ దైత్యులనైనా చంపే సామర్థ్యం కలిగి ఉంటుంది.
నందక: ఒకానొక సందర్భాన బ్రహ్మదేవుడు స్వర్గంగా తీరాన యజ్ఞం చేస్తుంటాడు. బ్రహ్మ ద్యానాని భగ్నం చేసేందుకు లోహాసురుడు అనేవాడు వస్తుంటాడు. వెంటనే బ్రహ్మ ధ్యానం నుంచి ఒక పురుషుడు వస్తాడు. ఆ పురుషునికి దేవత ల ఆశీస్సులు లభిస్తాయి. అతడు వెంటనే నందక అనే కత్తిగా మారిపొతాడు.  నందకం అంటే ఆనందం కలిగించేది అని అర్థం. దేవతలకు ఆనందం కలిగించినందులకు ఆ కత్తి నందక అనే పేరు కలిగింది.  దేవతల కోరికమేరకు నందకం ఖడ్గం విష్ణువుచే గ్రహించబడుతుంది. లోహాసురుడు నల్లని ముఖంతో వెయ్యి చేతులతో ఉంటాడు. అతడు తన చేతులతో దేవతలను గుంపు కూడనీయక చెల్లాచెదురు చేస్తుంటాడు. మహావిష్ణువు లోహాసురుని సహస్ర హస్తాలను నరికివేసే ప్రయత్నం చేస్తాడు. నందకం తగలగానే లోహాసురుని చేతులు లోహంగా మారిపోతాయి. అది గమనించి విష్ణువు అసురుని సంహరిస్తాడు. అప్పుడు నందకం స్వచ్చమైన ఆయుధంగా అవతరించెనని పురాణగాథ.
శార్ జ్గము: శార్ జ్గము విష్ణువుధనువు. దీనికి సంబంధించిన వివరాలు మహాభారతంలో ఉన్నాయి. కౌరవసభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించినపుడు, ఒక హస్తంలో శార్ జ ధనువు  కలిగి ఉంటాడు.  (ఉద్యోగపర్వం – 131 ఆధ్యాయం – 10 శ్లోకం). కృష్ణుని శార్ జ్గం ఇంద్రుని విజయధనువుతో సమానమైనది అని కూడా మహాభారతంలో చెప్పబడింది. (ఉద్యోగపర్వం – 158 ఆధ్యా – 5 శ్లో).  శార్ జ్గం బ్రహ్మచే నిర్మించబడింది. (అనుశాసనిక పర్వం 141 ఆధ్యాయం).
సుదర్శన చక్రరాజం
ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణస్తోమ భూషణ!
జనిభయస్థాన తారణ! జగదవస్థాన కారణ!
నిఖిల దుష్కర్మ కర్శన! నిగమ సద్ధర్మ దర్శన!
జయ జయ శ్రీ సుదర్శన! జయజయశ్రీ సుదర్శన! 
– శ్రీసుదర్శనాష్టకం
శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి.  అవి:  సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, కౌమోదకీ గద, నందా ఖడ్గం, శార్ జ్గ ధనువు;  కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం.
స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే!!
సౌరమాసం – కర్కాటాకంలో – చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం  అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది.
కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం |
విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !!
ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది.  యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని ఆయుధాలన్నింటిలోనూ చక్రత్తాళ్వార్ శక్తి వంతమైనది. పంచాయుధాలు నిత్యసూరి వర్గానికి చెందినవి. ఈ నిత్య సూరులు సర్వకాల సర్వవస్థలయందు భగవదాజ్ఞను ఆలోచనలను అమలుపరచటానికి సంసిద్ధమై ఉంటాయని విశ్వసింపబడుతోంది.
విష్ణుపురాణంలో, విష్ణువర్ణన సందర్భాన మాధవుని మేధస్సు గదారూపంగా ఉంటుందని చెప్పబడింది. పాంచజన్య శంఖం, శార్ జ్గధనువు భగవానుని జ్ఞానేంద్రియ ద్విభాగాలను సూచిస్తాయి. విష్ణువు ధరించిన చక్రం వాయు వేగ మనోవేగాలతో పయనించే శక్తి కలిగి ఉంటుంది. ఆచ్యుతుని ప్రకాశవంతమైన ఖడ్గం పవిత్రమైన వివేకానికి చిహ్నం. దానిని భగవానుడు వరలో నుంచి తీసి భక్తుల అజ్ఞానపు తెరలను చీల్చటానికి ఉపయోగిస్తుంటాడు. విష్ణువు ధరించే వైజయంతి అనే కంఠహారభూషణం అమూల్యమణిఖచితం.  ముత్యం, పగడం, పచ్చ, నీలం, వజ్రం అనే ఆ మాలికలోనిమణులు ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు అనే మూలకాలని తెలీయజేస్తాయి. పంచాయుధాలను భగవానుడు భక్త సంరక్షణార్థం ఉపయోగిస్తుంటాడు.  ఈ పంచాయుధాలు భగవానునికి సౌందర్యాన్ని కూర్చుతాయని వేదాంతదేశికులవారు సెలవిచ్చారు. ఈ పంచాయుధాలు కూడా వైజయంతిలోని మణులవలె తత్త్వాన్ని తెలియచేసే చిహ్నాలని విజ్ఞులు చెప్పారు. చక్రం మనస్తత్వాత్మకం,  శార్ జ్గం సాత్విక తామస రాజస గుణాలకు  సంబంధించిన అహంకార తత్త్వాత్మకం, కౌమోదకీ బుద్ధితత్త్వాత్మకం, నందకం జ్ఞానతత్త్వాత్మకం, నిశిత పరశీలనవల్ల ఈ తత్త్వం క్రమేపీ అవగతమౌతుంది.
విష్ణు సహస్ర నామాలలో భగవానుడు ధరించే ఆయుధ సంబంధమైన నామాలు గోచరిస్తాయి. 993వ నామం నుంచి 998వ నామం (విశిష్టాద్వైతభాష్యానుసారం) వరకు ఉన్నవి. భగవానుని ప్రధాన ఆయుధాలకు సంబంధించిన నామాలు.
993వ నామం శంఖభృత్. శంఖాన్ని ధరించినవాడు శంఖభృత్. ఈ శంఖానికి పాంచజన్యం అని పేరు. ఇది అహంకార తత్త్వాన్ని తెలియజేస్తుంది. తామసం కూడా అహంకారమే. ఇది పంచభూతాల పుట్టువునకు తావు (పాంచజన్య).
994వ నామం నందకీ. నందక అనే ఖడ్గాన్ని ధరించటంచేత భగవానుని నందకి అని పిలిచారు.
995వ నామం చక్రి. చక్రం ధరించినవాడు కనుక చక్రి.
996వ నామ శర్ జ్గధన్వ. శార్ జ్గము అనే ధనువుకలవాడు.
998వ నామ రథాంగపాణి. భగవానుడు ఒకానొక సందర్భాన రథచక్రాన్ని ధరించాడు. రథాంగం అంటే చక్రం అని కూడా అర్థం ఉంది. అయితే చక్రాన్ని ధరించినవాడు చక్రి కాగా రథాంగాన్ని (రథచక్రాన్ని) పాణియందు కలవాడు రథాంగపాణి, భారత యుద్ధంలో ఎలాంటి ఆయుధాన్ని ధరించనని కృష్ణుడు అర్జునునకు చెప్పి ఉంటాడు. అయితే యుద్ధం 9వ రోజున రథచక్రాన్ని (రథాంగాన్ని) పాణియందు ధరించి అర్జునుణ్ణి ప్రేరేపించి ఉత్తేజితుడిని చేసేందుకు భీష్మసంహారానికి సంసిద్ధుడవుతాడు. ఆ దృశ్యం అపంపశయ్యపై ఉన్న అంతిమ ఘడియల్లో కూడా మెదలడంచేత భీష్ముడు ఆ నామాన్ని విష్ణు సహసంలో చేర్చి ఉంటాడనుకోవచ్చు.
విష్ణుసహస్రనామలలో “సర్వప్రహరణాయుధ” అనే నామం ఉంది. ‘సర్వేషాం ప్రహరణాని ఆయుధాని యస్యస: సర్వ ప్రహరణాయుధ:” అంటే తననే రక్షకంగా ఆశ్రయించినవారికి సకల అనిష్టాలను సమూలంగా తొలగించే అనంతాలై, అపార సామర్థ్యంకలవై, తనకు తగినవై, ‘అనేక ఆభరణాలా? ఇవి?” అని సందేహించినట్లు, సదా సర్వత్ర సర్వప్రకారములచేత, అశ్రయించిన వారలను రక్షించటం అనే దీర్ఘ సత్రయాగాన దీక్షితాలై, సర్వైశ్వర్య భారాలను వహించి ఉండే దివ్యాయుధాలు కలవాడని అర్థం.
పూర్వపుదినాలలో విష్ణుసహస్రనామంతోపాటు పంచాయుధస్తోత్రం కూడా పారాయణం చేసేవారు. పంచాయుధ స్తోత్రాన్ని, ఎవరైతే పఠిస్తారో,  వారు పాపభయవిముక్తులవుతారని ఫలశ్రుతిలో చెప్పబడింది. అరణ్యంలో, యుద్ధంలో, అపాయంలో ఉన్న సమయాన పంచాయుధస్తోత్రం జపిస్తే వారికి భగవానుడు  పూర్తి రక్షణ కలిగిస్తాడని నమ్మకం.
“రామానుజనూట్రందాది” అనే ద్రవిడప్రబంధం లోని 33వ పాశురంలో మహావిష్ణువు పంచాయుధాలు ప్రపంచాన్ని రక్షించేదుకు శ్రీరామానుజులుగా అవతరించాయని దాని కర్త తిరువరంగత్తముదనార్ గారు చెప్పరు.  స్వామిదేశికుల  వారు కూడా “యతిరాజసప్తతి” లో ప్రభువైన విష్ణువు యొక్క పంచాయుధాల రామానుజులుగా అవతరించాయన్నారు.
పంచాయుధాల బొమ్మలను చిత్రించిన దండను పసిపిల్లల గొంతులో (మెడలో) రక్షగా వేసే ఆచారం తమిళనాడులో ఉండేది. ఈ ఆచారాన్ని తమిళుల పూర్వ రచనలు కూడా ఉదహరిస్తున్నాయి. ఉదాహరణలు – కంబరామాయణంలో ఈ విషయం తెలియచేయబడింది. పంచాయుధ తాళీ బాలరక్ష. అయితే పంచాయుధ స్తోత్రం పెద్దవారిని రక్షిస్తుందని భావించవచ్చు. అయితే దీనిని అన్యధా అపార్థం చేసుకోరాదు.
పెరియాళ్వారు తిరుమొళి పాశ్రురంలో (1-5-9) మహావిష్ణువు కృష్ణావతారంలో ఉన్నప్పుడు గొంతులో పంచాయుధ చిత్రిత హారం వేసుకొని ఉన్నట్లు వర్ణించబడటం ఈ సందర్భాన స్మరణీయం.
 

Related Posts