ప్రతీ పనికి ఎదో కారణం వెతుకుతుందీ ఈ కాలం మనిషి జన్మకొక కారణం మనిషి మరణానికి మరో కారణం మనసుల కలయికకొక కారణం ఎడబాటుకి ఇంకో కారణం కానీ ఎప్పుడూ ఒంటరితనమే తన బహుమానం. నిరాశా నిస్పృహలు రాగాలు ఆలపిస్తుంటే మహిళా తన గుండెల్లో పెల్లుబికే దుక్కన్ని తన గొంతులోనే సవరించుకుంటూ తన్ను తానూ నిందించుకుంటూ ఈ లోకంలో కాలం వెళ్లదీస్తుంది.
కానీ ఇప్పుడా రోజులు పోయాయి. అన్యాయం చేసినప్పుడు అక్రమం జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ లాంటి అవతారపురుషులు దానిని చీల్చి చెండాడడానికి సత్యాన్ని కాపాడడానికి ఈ లోకంలో అవతరిస్తారు... మల్లి మల్లి అవతరిస్తూనే ఉంటారు.
ఒక స్ఫురణ లో ఒక ఎరుకలో ఒక జ్ఞాపకంలో మల్లి మల్లి పుడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - పూనమ్ కౌర్ !!