దివ్యాంగులకి సచివాలయ ఉద్యోగలో అర్హత మార్కులు తగ్గించాలి.
ఒంగోలు ,
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం నాడు కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవిన్స్ లో జిల్లా నవ్యాంధ్ర సేవసమితి దివ్యాంగులకి ఎస్.సి,ఎస్.టి అబ్యర్డుల మాదిరిగా అర్హత మార్కులు తగ్గించి ఉద్యోగాలు కల్పించవలసినదిగా వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ సానుకులం గా స్పందించారని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవసమితి అధ్యక్షులు బి.వి నరసింహరావు తెలిపారు.దివ్యాంగులుకు ఎస్.సి,ఎస్.టి అభ్యర్థుల లాగా 45 మార్కులలోపు వచ్చిన అభ్యర్థులకు అవకాశం కల్పించిన విధంగానే దివ్యాంగులు కు అవకాశం ఇవ్వాలవాల్సిందిగా గ్రీవిన్స్ లో అడగగా కలెక్టర్ గారు స్పందించి మీకు తగ్గించలేదా అని అడిగారు. తగ్గించలేదు తగ్గించి అవకాశం ఇవ్వాల్సినందుకు మిమ్మల్ని కలవాలని వచ్చామని చెప్పారు. మీకు తగ్గించేలా పైకి ప్రతిపాదనలు పంపుతాము,మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని సానుకూలంగా స్పందించారు.