YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

"సూర్యకాంతం" ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది గయ్యాల అత్తే

"సూర్యకాంతం" ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది గయ్యాల అత్తే

"సూర్యకాంతం" ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది గయ్యాల అత్తే.తెలుగు రాష్ట్రంలో ఒకప్పుడు సూర్యకాంతంగారి పేరు వింటే కోడళ్ళందరూ గజగజ వణికిపోయారంట. ఆమె వల్ల సూర్యకాంతం అనే పేరు పెట్టుకొనేందుకు భయపడ్డారు..అంతలా భయపెట్టింది నటనలో అత్తగా ఆమె.. అత్తల దినోత్సవంరోజే ఆమె పుట్టినరోజు కావడం యాధృచ్ఛకం!!!
సూర్యకాంతంగారు 1924 అక్టోబరు 28 న కాకినాడ కు దగ్గరలో గల వెంకటకృష్ణరాయపురంలో 14 వ సంతానం జన్మించారు. ఆరు సంవత్సరాలకే సంగీతం,నాట్యం నేర్చుకున్నారు.హిందీ సినిమాలు చూసి సినిమారంగం పై మక్కువతో చెన్నై చేరారు. 1949 లో "చంద్రలేఖ"అనే సినిమాలో డ్యాన్సర్ గా చేసి 75 రూపాయల పారితోషికం తీసుకున్నారు. తర్వాత "ధర్మాంగద" అనే సినిమాలో మూగ అమ్మాయిగా నటించింది. నారదనారది సినిమాలో సహాయనటిగా నటించింది. గృహప్రవేశం లో కొంచెం పేరుండే పాత్ర పోషించింది. అయితే సౌదామిని అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా యాక్సిడెంట్ అయి మొహం దెబ్బతినడంతో ఆ అవకాశం పోగొట్టుకున్నారు..కెరీర్ ఇబ్బందిగా సాగే సమయంలో సంసారం అనే సినిమాలో 'అత్తగారి" పాత్ర లభించడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది.. ఆ సినిమాతో తెలుగు సినిమాపరిశ్రమలో "సూర్యకాంతంగారు వెలిగిపోయారు"తనకంటూ ప్రత్యేక అధ్యాయం సృష్టించుకున్నారు. వాస్తవానికి సూర్యకాంతంగారు చాలామంచి మనసుకలవారు..అందరితోనూ చాల అప్యాయంగామాట్లాడేవారు.సున్నితమనస్కులు.ఒక సినిమాలో చిత్తూరునాగయ్యను తిట్టే సన్నివేశంలో తిట్టలేక బోరున వేడ్చారట....అయినా సూర్యకాంతం అత్తగారికి భయపడాల్సింది కోడళ్ళేగానీ అల్లుళ్ళు కాదు..ఎందుకంటే ఆమె అల్లుళ్ళను చాలా ప్రేమగా చూసుకునేది.ఆమె నటించిన" గుండమ్మకథ" ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచింది.... మాట కరుకు మనసువెన్న మన సూర్యకాంతం గారిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము!!

Related Posts