YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజ్యసభకు కవిత

రాజ్యసభకు కవిత

రాజ్యసభకు కవిత
హైద్రాబాద్, 
కల్వకుంట్ల కవిత రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన కవిత తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కవిత ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. అయితే ఓటమిపాలయిన అగ్రనేతలకు ఏదో ఒక పోస్ట్ ఇస్తున్న గులాబీబాస్ కేసీఆర్ తన కుమార్తె విషయంలో ఎందుకు సంకోచిస్తున్నారు. కవితను రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారా? కవితకు ఏ పదవి దక్కనుంది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయింది.కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా అందరి మన్ననలను అందుకున్నారు. పార్లమెంటులో బలంగా తెలంగాణా వాణిని విన్పించారు.కేసీఆర్ కుమార్తె కూడా కావడంతో ఢిల్లీలో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి కవిత మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని కవిత అనుమానిస్తున్నారు. తన సన్నిహితుల ద్వారా సాక్ష్యాధారాలను కవిత సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరెవరు తన విజయానికి కృషి చేయలేదో కవిత నివేదిక రూపంలో కేసీఆర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కవిత పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలందరూ ఏకతాటి పై ఉండేవారు. ఎంపీగా తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను ఆమె శ్రమించి గెలిపించుకున్నారు. కానీ కవిత పోటీ చేసినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు కొందరు లోపాయి కారీ ఒప్పందాలతో వెన్నుపోటు పొడిచారని కవిత భావిస్తున్నారు. ఇక ఇటీవల కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయిన వినోద్ కుమార్ కు కేసీఆర్ ప్రణాళిక సంఘం బాధ్యతలను అప్పగించారు. అలాగే కవితకు కూడా పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కవిత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడాన్ని కూడా ఆయన గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు.కనీసం నిజామాబాద్ ఎమ్మెల్యేలకు కూడా కవిత అపాయింట్ మెంట్ దొరకడం లేదు. వారికి దూరంగా ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్లుంది.కవితను రాజ్యసభ కు పంపాలన్నది కేసీఆర్ యోచనగా ఉంది. అయితే ఇప్పట్లో రాజ్యసభ పదవి ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఏదైనా రాజ్యసభ స్థానం ఖాళీ అయితేనే కవితకు ఛాన్స్ దక్కుతుంది. కవిత కూడా రాజ్యసభ కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. రాజ్యసభ పదవి మాత్రమే కవితకు ఫిట్ అయిన పదవి అని కేసీఆర్ కూడా భావిస్తుండటంతో అది ఖాళీ అయ్యేంత వరకూ కవితమ్మ వేచిచూడక తప్పదు. రాజ్యసభ పదవి చేపట్టిన తర్వాతనే నిజామాబాద్ రాజకీయాల్లో తలదూర్చాలని కూడా కవితత భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మొత్తం మీద పదవి ఫిక్స్ అయింది. కానీ టైమ్ ఇంకా ఫిక్స్ కాలేదన్నది గులాబీ పార్టీలో చర్చజరుగుతోంది.

Related Posts