YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం

అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం

అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం
ప్రజా ప్రతినిధిగా గెలవడం కన్నా పసిపిల్లల కి వైద్యం చేయించడం, వారిని కాపాడటం లొనే సంతృప్తి
నిజామాబాద్ 
 ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో దీపావళి సందర్భంగా కలవాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు , తెలంగాణ లో ఆయుష్మాన్ భారత్ పథకం లేకపోవడంతో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో బస్వా గార్డెన్స్ నిజామాబాద్ లో, ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలిశారు. ఫౌండేషన్ ద్వారా 130 పైగా చిన్నారులు చికిత్సతీసుకున్నారు. అందులో నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 22 కుటుంబాల వాళ్ళతో ఆత్మీయ భేటీ జరిగింది. చికిత్స కొరకు అనేక ఇబ్బందులు ఉండి, కొందరు చివరికి తమ పిల్లల మీద ఆశలు వదులుకున్న వారు కూడా ఫౌండేషన్ సహాయంతో చికిత్స తీసుకుని నేడు ఆరోగ్యంగా ఉన్నారు. కాలేయ మార్పిడి, బ్రెయిన్ ట్యూమర్స్, బ్లడ్ క్యాన్సర్, గుండె కు, ఊపిరి తిత్తుల కు చిల్లులు ఉన్న ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు చికిత్స జరిగి నేడు వారు ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి అవకాశం కల్పించడం దేవుడిచ్చిన భాగ్యం అని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.
ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ఉంటే ఇలాంటి మరింత మంది కి ఇబ్బంది లేకుండా చికిత్స దొరికే అవకాశం ఉంటుందని వెంటనే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు.వచ్చిన కుటుంబాల తో ఆత్మీయ పలకరింపుల తర్వాత వారితోనే కలిసి భోజనం చేసి, దీపావళి సందర్భంగా వారికి చిరు కానుకలతో సత్కరించారు.

Related Posts