YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జమిలీ ఆశలు గల్లంతేనా...

జమిలీ ఆశలు గల్లంతేనా...

జమిలీ ఆశలు గల్లంతేనా...
న్యూఢిల్లీ, అక్టోబర్ 30  
అదేంటి.. జగన్ని అయిదేళ్ళకు కదా ఏపీ ప్రజలు ఎన్నుకుంది, ఇందులో వింత ఏముందని సందేహం కలగవచ్చు. కానీ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉన్న వాతావరణం చూసినపుడు గత అయిదు నెలలుగా ఒక సంశయం వైసీపీలో కూడా ఉంది. కేంద్రంలో బలంగా ఉన్న మోడీ, అమిత్ షాల నాయకత్వంలో ఏం చేసినా జరిగిపోయేదే. ఆ నేపధ్యంలో రెండవ మారు అధికారంలోకి వచ్చాక జమిలి ఎన్నికల పాట అందుకున్నారు. దాంతో మళ్లీ మూడేళ్ళకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్ సభకు ఒకేమారు ఎన్నికలు పెట్టాలని కమలం పార్టీ కుతూహలం పడింది. దాంతో జగన్ మూడేళ్ళ సీఎం అని ఇక్కడ విపక్షాలు ప్రచారం చేయడం మొదలెట్టాయి. జగన్ సైతం ఆ మధ్యన జమిలి ఎన్నికలపై ప్రధాని పెట్టిన మీటింగుకు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పాలనను ఉరుకులు పరుగులు పడుతున్నారు.దేశంలో బీజేపీ హవా బలంగా ఉంది, విపక్షాలకు అసలు ఛాన్స్ లేదని బీజేపీ భావించింది. కానీ తాజాగా వచ్చిన ఫలితాలు చూసుకుంటే హర్యానాలో హంగ్, మహారాష్ట్రాలో తక్కువ సీట్లు రావడంతో బీజేపీ పునరాలోచనలో పడిందని అంటున్నారు. దాంతో జమిలి ఎన్నికలకు వెళ్ళడానికి సాహసించే అవకాశమే లేదని హస్తిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి. అయిదేళ్ళకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముందు సద్వినియోగం చేసుకుని ఆ మీదట ఆలోచన చేయాలన్నది కమలనాధుల తాజా వ్యూహంగా ఉందంటున్నారు. దీంతో జమిలి ఎన్నికలు ఉండవని క్లారిటీగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో ఏపీలో జగన్ సర్కార్ పదవీ కాలం మళ్ళీ రెండేళ్లకు పెరిగింది. అంటే షెడ్యూల్ ప్రకారం 2024 మే నేలలోనే ఎన్నికలు జరుగుతాయన్నమాట. దీంతో పాలనాపరంగా అనేక జనామోద నిర్ణయాలు తీసుకుని వాటితో మరింత మెప్పు పొందే అవకాశం జగన్ కి ఇపుడు ఉందని అంటున్నారు.ఇక ఏపీలో రాజకీయాన్ని చూస్తే ఎపుడు ఎన్నికలు వస్తాయా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న టీడీపీ తమ్ముళ్ళకు మాత్రం తాజా పరిణామాలు ఖంగు తినిపించేలా ఉన్నాయంటున్నారు. తమ్ముళ్ళూ అపుడే ఆరు నెలలు గడిచాయి. ఇక మిగిలింది గట్టిగా రెండేళ్ళే అంటూ ఈ మధ్యనే విశాఖ, శ్రీకాకుళం సమీక్షల సందర్భంగా చంద్రబాబు తమ్ముళ్ళకు జోష్ పెంచారు మరి జమిలి ఎన్నికలు ఉండవంటే మాత్రం టీడీపీకి గొంతు ఎండిపోతుందేమో. అయిదేళ్ళ పాటు జగన్ అధికారంలో ఉంటే ఎలా. అయిదు నెలలకే తట్టుకోలేని పార్టీగా ఉందిపుడు. రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారిపోతే మరి ఇబ్బందే. ఇక టీడీపీ అడుగులో అడుగులు వేస్తున్న జనసేన సైతం ఇపుడు రేపో మాపో ఎన్నికలు వచ్చెస్తాయి అంటూ కొత్త‌ పల్లవి అందుకుంటోంది. మరి అయిదేళ్ళ పాటు పయనం అంటే దుర్బరమే. పార్టీని నిలబెట్టి జనంలోకి తీసుకుపోవడం కూడా కష్టమే. చూడాలి మరి జగన్ దూకుడును ఎలా తట్టుకుంటాయో ఏపీలోని విపక్షాలు.

Related Posts