నీలకంటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు ప్రారంభం..
ఎమ్మిగనూరు అక్టోబర్ 30
పట్టణంలోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని ఆలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. శివ, వైష్ణవాలయాల్లో ఆకాశదీపాలు ఏర్పాటుచేయడము ఈ మాసంలో ప్రత్యేకత సంతరించుకుంది. పట్టణంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలను వంశపారంపర్య ధర్మకర్త మాచాని నీలకంఠప్ప నాగరాజు ప్రారంభించారు. అందులో భాగంగా గణపతి పూజ, అఖండ దీపారాధన,నందికోలు కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మకర్త మాచాని నీలకంఠప్ప మాట్లాడుతూ కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల, పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రథమైనది.