దుర్గమ్మ సన్నిధీలో కేంద్ర మంత్రి పురుషోత్తం కోడాభాయ్ రూపాల
విజయవాడ అక్టోబర్ 30
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం కోడాభాయ్ రూపాల బుధవారం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అయన కు ఆలయ కార్యనిర్వహణాదికారి ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం పురుషోత్తం కోడాభాయ్ రూపాలకు వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసారు.