ప్రజ్ఞాపూర్ లో గాంధీజీ సంకల్ప యాత్ర
సిద్దిపేట అక్టోబర్ 30
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుండి బుధవారం భారతీయ జనత పార్టీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు రెండవ విడత గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభంచారు. ఈ సంకల్ప పాదయాత్రలో సిద్దిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీనివాస్, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, ఎల్లు రాంరెడ్డి, భాజపా రాష్ట్ర కార్యదర్శి, జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్, గజ్వెల్ నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈయాత్ర ప్రజ్ఞాపూర్ క్రాస్ రోడ్ వద్దకు రాగానే 20 మంది ఆర్టీసీ కార్మికులు సంకల్ప పాదయాత్రకు మద్దతు తెలిపి పాదయాత్రలో కలిసారు.