అబ్బాయిల పెళ్లి వయసు 18 ఏళ్లకు తగ్గింపు?
న్యూఢిల్లీ అక్టోబర్ 30
పెళ్లి.. ఆ వయసు వచ్చాకే తమ పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తారు. 2006 బాల్య వివాహాల నియంత్రణ చట్టం(పీసీఎంఏ) ప్రకారం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు పూర్తయితేనే పెళ్లి చేయాలి. అయితే ఇకపై అబ్బాయిలు కూడా 18 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కేయొచ్చు. అబ్బాయిల పెళ్లి వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న జరిగిన అంతర్గత సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచురించింది. ఆ సమావేశంలో న్యాయశాఖ, హోంశాఖ, ఆరోగ్యశాఖ, గిరిజన, మైనారిటీ శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. చట్టాన్ని అతిక్రమించేవారికి విధించే జైలు శిక్షను 2 నుంచి 7 సంవత్సరాలకు పెంచడంతో పాటు జరిమానాను రూ. లక్ష నుంచి 7 లక్షలకు పెంచాలని కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైనది. అయితే దానికంటూ ఒక వయసు ఉంటుంది.