క్రీడల్లో ఎదగడానికి పోటీతత్వం అవసరం
సరోజిని అకాడమీ కార్యదర్శిజి.కిరణ్ రెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 30 (న్యూస్ పల్స్)
బాగ్‌లింగంపల్లిలోని సరోజిని క్రికెట్, టెన్నిస్ అండ్ ఫిట్‌నెస్ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్-8, అండర్-10, అండర్-12, అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలబాలికలు తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీలో అండర్-12 బాలికల విభాగంలో అకాడమీకి చెందిన ఐశ్వర్య టైటిల్‌ను అందుకుంది. విద్యశ్రీతో తలపడిన ఐశ్యర్య 6-4 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఐశ్యర్య ఫోర్‌హ్యాండ్, సర్వీస్ బాగా ఉండటం ఆటలో కలిసి వచ్చింది. వేదశ్రీ బ్యాక్‌హ్యాండ్ బాగా ఉన్నప్పటికీ ఐశ్యర్య ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయింది. మిగతా విభాగాల్లో పరిశీలించినట్లయితే, అండర్ 12 బాలుర విభాగంలో మనోహర్ రెడ్డి 6-2తో పుష్కర్‌పై నెగ్గాడు. అండర్-14 విభాగంలోనూ మనోహర్ రెడ్డి అభినవ్‌తో తలపడి 6-2 పాయింట్లతో విజేతగా నిలిచాడు. అండర్-10 బాలికల విభాగంలో సాన్వీ 6-4తో నిషాను ఓడించింది. అండర్-8 బాలుర విభాగంలో కె.మౌర్య 6-4తో తనుష్ రెడ్డిపై నెగ్గాడు. అండర్-8 బాలికల విభాగంలో సవర్ణికతో తలపడిన నిషా 6-4తో విన్నర్‌గా నిలిచింది. అండర్-10 బాలుర విభాగంలో పార్థివ్ 6-4తో విధాన్‌పై విజయం సాధించాడు.కాగా, విన్నర్, రన్నరప్‌గా నిలిచిన విద్యార్థులను సరోజిని అకాడమీ కార్యదర్శి, జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారులు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ శ్రీ జి.కిరణ్ రెడ్డి అభినందిస్తూ పోటీతత్వంతో ఆడినప్పుడే ఆటలో రాణించడం ఎలాగో తెలుస్తుందన్నారు. విద్యార్థులకు విద్య ఎంతో ముఖ్యమో క్రీడలూ అంతే ప్రాధానమని, ఆటల్లో నెగ్గాడానికి అంకితభావంతో శిక్షణను కొనసాగించిన వారు తప్పక ప్రయోజకులు అవుతారని చెప్పారు. విజేతలకు ఆయన ప్రత్యేకంగా మెడల్స్, మెమెంటో, సర్టిఫికెట్లను అందజేశారు.