చలో విశాఖపట్నం గోడ పత్రిక విడుదల
ఇసుక తవ్వకాల బంద్ కుదేలైన నిర్మాణ రంగం
- రేఖ గౌడ్
ఎమ్మిగనూరు అక్టోబర్ 30
ప్రభుత్వం అవలంభిస్తున్న నూతన ఇసుక విధానం పాలసీని ప్రకటిస్తామంటు ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతో భవన నిర్మాణ రంగం స్తంభించి పోయిందని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ బాధ్యురాలు రేఖగౌడ్, నాయకులు,రాహుల్ సాగర్ అన్నారు. ,మండల కేంద్రమైన గోనెగండ్ల లో బుధవారం రోజు నవంబర్ 3 తేదీన జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన చలో విశాఖపట్నం గోడ పత్రికలను భవన నిర్మాణ కార్మికులైన సద్దాం, చిరంజీవి,మల్లి, చేతులమీదుగా గోడ పత్రికలు విడుదల చేశారు,అనంతరం రేఖగౌడ్ మాట్లాడుతూ నిర్మాణ పనులకు ఉపయోగించే వాటిలో ఇసుకే ప్రదానం కావడంతో తవ్వాకలపై ఆంక్షలు పెట్టి కార్మికులపైనే కాకుండా సిమెంట్,ఇటుక, అమ్మకాలు చేసే వ్యాపారులపైన ప్రభావం చూపుతుందని నిర్మాణరంగం కార్మికుల పరిస్థితి నాలుగు నెలలుగా దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు, కృత్రిమ ఇసుక కొరత కు ప్రభుత్వ విధానాలే కారణమని వేలాదిమంది కార్మికులు ఉపాదిలేక వలసలకు పోతుంటే కొందరు పుటగడవక పస్తూలుంటున్నారని వరదల వలన ఇసుక సరఫరా చేయలేక పోతున్నామని ప్రభుత్వం చెప్పడం ఏంటని ఇతర రాష్ట్రాల్లో లేని వరద ఆంద్రప్రదేశ్ లొనే ఉందా అని ప్రశ్నించారు,పనులు లేక పోషణ భారమై కార్మికులు ఇబ్బందులు పడుతుంటే కొత్త విధానం పేరుతో వరదలను కారణంగా చూపిస్తూ జాప్యం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు,ప్రత్యామ్నాయ ఇసుక తవ్వకాలకు వాగులు,వంకల్లో వెళితే అడ్డుపడుతున్నారని అన్నారు, ప్రభుత్వం బాధిత కార్మికులకు ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ జనసేనపార్టీ చేప్పట్టిన ఛలో విశాఖ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మండల జనసేనపార్టీ నాయకులు మస్తాన్ వలి,సుబాన్, హరికృష్ణ, షఫీ,జానీ, పవన్, వెంకటేష్,రామంజినేయులు,భాస్కర్, మరియు మెగా ఫ్యాన్స్ మండల నాయకులు మాలిక్ పాల్గొన్నారు,