YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తం. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైటాయించిన రైతులు

సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తం. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైటాయించిన రైతులు

సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తం.
మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైటాయించిన రైతులు..
పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం తులోపోలాట చోటు చేసుకుంది.. రైతులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు
హైదరాబాద్ అక్టోబర్ 30,
సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని రైతులు అందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైటాయించారు.  కూరగాయల బస్తా తూకం 50-65కిలోల మద్యలో ఉండడం వలన మేము నష్టపోతాము.. కాళీ బస్తా ఖరీదును సరుకు కొనుగోలు దారుడే భరించాలి అంటూ తమ వినతి పత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ అధికారికి అందించి శాంతి యుతంగా చర్చించడానికి వచ్చామని రైతులు అన్ఆరు.  ర్యాలీగా రావడంతో పాటు ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే అరెస్ట్ చేశామని పోలీసుల వాదన.  రైతులు మాట్లాడుతూ సమన్యాయమంటూ హమాలీలకు లాభం రైతులకు నష్టం వచ్చే విదంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని తమ ఆవేదన వ్యక్తం చేశారు.. కూరగాయలు మార్కెట్ కు తేవడానికి అయ్యే ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి, కమీషన్ రైతుల దగ్గర కాకుండా కొనుగోలు దారుల నుండి వసూల్ చేయాలి, హమాలి చార్జీలు తగ్గించాలి అని వారు డిమాండ్ చేశారు..  రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేసి చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.. గిట్టు బాట ధర తక్కువ చేస్తే ఎకరానికి 12 వేలు నష్ట పోతామని రైతులు నినాదాలు చేసారు. 

Related Posts