YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇసుక లభ్యతపై చర్యలు 

ఇసుక లభ్యతపై చర్యలు 

ఇసుక లభ్యతపై చర్యలు 
ఒంగోలు, అక్టోబర్ 30,
జిల్లాలో ఇసుక కొరతను తీర్చేందుకు అవసరమైన సత్వర చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పోల  భాస్కర్ తెలిపారు. బుధవారం ఉదయం ప్రకాశం  భవనంలోని  సి.పి.ఓ.సమావేశం  మందిరంలో ఇసుక పాలసీపై  ఆయన పాత్రికేయ  సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 41  మంది రైతులకు చెందిన పట్టా భూములలో ఇసుక వున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 27 మంది  రైతులకు చెందిన పట్టా భూములలో ఇసుక ను త్రవ్వేందుకు అనుమతి తీసుకోవడం జరిగిందని  కలెక్టర్ తెలిపారు. మరొక 14 మంది రైతుల దరఖాస్తులు ప్రాసెస్ లో వున్నాయన్నారు. జిల్లాలో ఇసుకను మారు  మూల ప్రాంతాల వినియోదారులకు కూడా అందుబాటులోకి  తెచ్ఛే విధంగా  5  నదుల పరిధిలో 23  మండలాలలో ఇసుక వున్నట్లు  జిల్లా సంయుక్త కలెక్టర్  ఆధ్వర్యంలో గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.  జిల్లాలో  గతంలో నోటిఫై  చేసిన 12 ఇసుక రీచ్ లలో ఇసుక లభ్యత  పూర్తిగా తగ్గినదని కలెక్టర్ తెలిపారు.
ఇసుక కావలసిన వినియోగదారులు వి.సి.,యం.డి,ఎ.పి.యం.డి.సి లిమిటెడ్ పేరుపై డిమాండ్ డ్రాప్టు లేదా ట్రెజరీ హెడ్ ఆఫ్ అకౌంట్ నెం085300102000020000వి.ఎన్,  సర్వీస్ కోడ్-4008 ఎ.పి.యం.డి.సి.కి. చెల్లించాల్సి వుంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పాలేరు, బిట్రగుంట సప్లై ఛానల్ లో 3 లక్షల 8 వేల మెట్రిక్ టన్నుల ఇసుక వుందని ఇరిగేషన్ అధికారులు గుర్తించి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాని తెలిపారు. సదరు  సప్లై ఛానల్ లో ఇసుక త్రవ్వడానికి అవకాశం వుందని  ప్రస్తుతం  భారీ వర్షాలు కురిసినందున  ఇసుక త్రవ్వడానికి ఆటకం కల్గుతున్నదని కలెక్టర్ తెలిపారు.  ఇసుక కావలసిన వినియోగదారులు  ఆన్ లైన్ పేమెంట్, డిమాండ్ డ్రాప్టు ద్వారా చెల్లించిన రశీదు గ్రామాలలో గల పంచాయితీ సెక్రటరీ కాని, గ్రామ రెవిన్యూ అధికారికి గాని చూపి ఇసుకను తీసుకొనుటకు అనుమతి పొందాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లో కందుకూరు, కనిగిరి, పొదిలి  మండలాలలో ఇసుక యార్డులు ఏర్పాటు చేసి ప్రజలకు ఇసుక  అందుబాటులోకి  తీసుకొని రావడం జరుగుతుందని  కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఆగస్టు మాసం  నుండి అక్టోబర్ వరకు  వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే అవకాశాలు వున్నాయని,  నవంబర్ యాసం నుండి మే యాసం  వరకు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాత్రికేయ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యస్.షన్మోహన్, మైన్స్ డిప్యూటీ డేరెక్టర్ డైరెక్టర్ నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Related Posts