Highlights
కొత్త పోలీసు స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్ అక్టోబర్ 30,(న్యూస్ పల్స్):
వరంగల్ రూరల్ జిల్లా లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యఆథితిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ వి.రవీందర్, కలెక్టర్ ఎం.హరిత తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దారు. వాహనాలను, ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందించారు. నేరస్థులకు ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతోంది. పోలీసు శాఖ సవాలుగా తీసుకుని నేరాలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. అవినీతి పరులను, భూ కబ్జాదారులను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. పరకాల నియోజకవర్గంలో నేరాలకు అడ్డుకట్ట పడిందని అన్నారు. పోలీసు శాఖ తీరు, ముఖ్యంగా వరంగల్ పోలీసుల తీరు అభినందనీయం. కేసీఆర్ పరిపాలంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపులోకి వస్తున్నారు. కొత్త సాంకేతిక వ్యవస్థను పోలీసు శాఖ చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.22 వేలకు పెంచారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖను అన్ని రకాలుగా తీర్చిదిద్దారని అన్నారు.