YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దుమ్ము రేపిన స్టాక్ మార్కెట్లు ముంబై,

Highlights

✺ అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, సిప్లా, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 5 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో సూచీలు నష్టాల్లో క్లోజయ్యాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.63 శాతం తగ్గుదలతో 61.20 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.23 శాతం క్షీణతతో 55.41 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. 6 పైసలు క్షీణతతో 70.91 వద్ద కదలాడుతోంది

దుమ్ము రేపిన స్టాక్ మార్కెట్లు ముంబై,

దుమ్ము రేపిన స్టాక్ మార్కెట్లు
ముంబై, అక్టోబర్ 30, (న్యూస్ పల్స్)
దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ ర్యాలీ చేసింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఐటీ, ఎప్ఎంసీజీ రంగ షేర్లు పరుగులు పెట్టడం మార్కెట్‌కు కలిసొచ్చింది. సెన్సెక్స్ 40,000 పాయింట్ల పైన క్లోజయ్యింది. జూన్ 4 నుంచి చూస్తే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో క్లోజ్ కావడం ఇదే తొలిసారి. నిఫ్టీ కూడా 11,800 పాయింట్ల మార్క్‌ పైనే ముగిసింది. జూలై 5 నుంచి చూస్తే సూచీ ఈ స్థాయిలో క్లోజ్ కావడం ఇదే ప్రథమం.బుధవారం చివరకు సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,844 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 346 పాయింట్ల మేర పెరిగింది. నిఫ్టీ కూడా 97 పాయింట్లు పైకి కదిలింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పరుగులు పెట్టారు నిఫ్టీ 50లో గెయిల్, గ్రాసిమ్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఐటీసీ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. గెయిల్ 6 శాతానికి పైగా పెరిగింది.
 

Related Posts